Friday, 25 September 2026 11:13:42 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

మహిళా సంఘాలకు సోషల్ ఆడిట్ నిర్వహణ కానుకుంట గ్రామంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ సోషల్ ఆడిట్ పూర్తి

Date : 02 July 2026 05:58 PM Views : 103

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : మహిళా సంఘాల పనితీరును మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోషల్ ఆడిట్ పైలట్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల, పటాన్చెరు మండలాల్లో మహిళా సంఘాలపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఈ పైలట్ కార్యక్రమాన్ని అమలు చేయాలని గౌరవ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలోని కానుకుంట-2 గ్రామైక్య సంఘం పరిధిలోని 34 మహిళా సంఘాలపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సోషల్ ఆడిట్ కార్యక్రమం కానుకుంట గ్రామంలో జరగడం విశేషం.ఈ సోషల్ ఆడిట్ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమై నిన్నటితో ముగిసింది. సోషల్ ఆడిట్ సందర్భంగా గుర్తించిన అంశాలను మహిళా గ్రామసభ ద్వారా సంఘ సభ్యులకు వివరించారు. సభ్యులు ఆ అంశాలను శ్రద్ధగా విని, చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకుంటామని తెలిపారు.ముఖ్యంగా మహిళా సంఘాల పొదుపులలో భాగంగా తీసుకున్న అంతర్గత అప్పుల విషయంలో సభ్యులు అసలు కంటే వడ్డీలను మాత్రమే చెల్లిస్తూ వస్తున్నారని సోషల్ ఆడిట్‌లో గుర్తించారు. దీనిపై అవగాహన కల్పించడంతో సభ్యులు ఇకపై కిస్తీలు పెంచుకొని అసలును కూడా క్రమంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి సీఆర్‌డీ డిప్యూటీ డైరెక్టర్ ఉషారాణి, రాష్ట్ర స్థాయి సెర్ప్ కార్యాలయం నుంచి జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ రాజేష్, జిల్లా స్థాయి అధికారి జాన్ కెన్నడీ (డీపీఎం), ఏపీఎం నరేందర్, సీసీ వరలక్ష్మి, వీఓఏ మహేశ్వరి, గ్రామ సంఘం అధ్యక్షులు యశోద, పూజ, మహిళా సంఘాల సభ్యులు, సోషల్ ఆడిట్ బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల పనితీరును, సభ్యుల స్పందనను రాష్ట్ర స్థాయి సీఆర్‌డీ డిప్యూటీ డైరెక్టర్ ఉషారాణి అభినందించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :