Saturday, 26 September 2026 11:24:28 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

మహబూబ్‌నగర్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణ*

పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం.. భారీ కార్ ర్యాలీ

Date : 29 July 2026 10:07 PM Views : 51

ప్రజా పిలుపు / తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా పట్టణంలోని ఏనుగొండలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములవాడ మదన్ మోహన్ చారి, జిల్లా అధ్యక్షుడు మున్నూరు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం పలికారు.జెండా ఆవిష్కరణ అనంతరం ఏనుగొండ నుంచి దేవరకద్రలో నిర్వహించనున్న బహిరంగ సభ వరకు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్లతో పాటు ద్విచక్ర వాహనాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తమ మద్దతును చాటిచెప్పారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని, కార్యకర్తల ఉత్సాహం పార్టీని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :