ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న బస్సు బ్రేక్ వేయడంతో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సల్మాన్ (30) తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అయితే ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రామచంద్రపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బోల్తాపడిన బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Admin
ప్రజా పిలుపు