Thursday, 24 September 2026 12:20:29 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

ఆగస్టు 10 వరకు ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు అవకాశం*

*ప్రతి అర్హత గల ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండాలి* జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్*

Date : 01 August 2026 04:17 PM Views : 50

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును భారత ఎన్నికల సంఘం ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా తమ ఫారాలను సమర్పించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 78 శాతం పూర్తయిందని తెలిపారు. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆగస్టు 10 లోపు తమ ఫారాలను సంబంధిత బీఎల్‌వోలకు తప్పనిసరిగా సమర్పించాలని కోరారు.అలాగే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 10 నాటికి పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17, 2026న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు ఓటర్లు క్లెయిమ్స్, అభ్యంతరాలను సమర్పించవచ్చని తెలిపారు.స్వీకరించిన క్లెయిమ్స్, అభ్యంతరాలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిశీలించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు పరిష్కార ప్రక్రియ చేపట్టనున్నట్లు, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురించబడుతుందని వెల్లడించారు.జిల్లాలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో ఉండాలన్నారు.బీఎల్‌వోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :