Tuesday, 10 November 2026 07:52:45 PM
# యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి

చిట్కుల్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తి...బహుజనుల కోసం భుజాన తుపాకీ పట్టి.. సమానత్వం కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ

Date : 26 September 2026 03:41 PM Views : 100

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : చిట్కుల్, సెప్టెంబర్ 26: పెత్తందారుల చేతిలో అణచివేతకు గురైన వర్గాలకు తిరుగుబాటు తత్వాన్ని నేర్పించి, ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని శనివారం చిట్కుల్‌లోని ఐలమ్మ విగ్రహానికి నీలం మధు ముదిరాజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర త్యాగధనుల అమరత్వంతో ముడిపడి ఉందన్నారు. ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సమాజంలో ప్రశ్నించే తత్వం అలవడిందని పేర్కొన్నారు.నిజాం నిరంకుశ పాలనలో అణచివేతకు గురైన ప్రజల కోసం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, దొరలు, జమీందారుల చేతుల్లో బానిసలుగా మగ్గుతున్న బహుజనులకు స్ఫూర్తినిస్తూ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె పోరాటం హక్కులు, ఆత్మగౌరవం, సమానత్వం కోసం సాగిన పోరాటానికి ప్రతీకగా నిలిచిందన్నారు.బహుజనుల కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో సబ్బండ వర్గాల ప్రతినిధిగా చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని చిట్కుల్‌లో ఏర్పాటు చేసినట్లు నీలం మధు ముదిరాజ్ గుర్తుచేశారు.మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ప్రభుత్వం ఆమెకు గుర్తింపు కల్పించిందని తెలిపారు.రేవంత్ రెడ్డి స్ఫూర్తితో సబ్బండ వర్గాలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నీలం మధు ముదిరాజ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ మోతె సుమలత, కౌన్సిలర్లు సంగన్నగారి గోపాల్, దస్తగిరి, వెంకటేష్, ఆంజనేయులు, మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పొట్టి నారాయణ రెడ్డి, నర్సింగ్ యాదవ్, రజక సంఘం సభ్యులు చాకలి సత్యనారాయణ, చాకలి బాబు, చాకలి అర్జున్, చాకలి యాదయ్య, చాకలి రవి, చాకలి కిషోర్, చాకలి చందు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :