ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చేరు పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట ఉన్న రహదారి చెత్త కుప్పలతో డంపింగ్ యార్డును తలపిస్తోంది. రహదారిపై పేరుకుపోయిన చెత్తాచెదారం నుంచి వెలువడుతున్న తీవ్ర దుర్వాసనతో అటువైపుగా ప్రయాణించే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాదచారులు ముక్కు మూసుకొని రహదారిని దాటాల్సిన దుస్థితి నెలకొంది. నిత్యం ప్రజల రాకపోకలు సాగించే ప్రాంతంలో ఇంతటి అపరిశుభ్రత నెలకొన్నప్పటికీ సంబంధిత జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు