ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) సోమవారం ఉదయం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ స్వామివారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.ఎమ్మెల్యే ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం అందజేశారు.ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
Admin
ప్రజా పిలుపు