Thursday, 24 September 2026 10:57:44 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

కలెక్టరేట్ ప్రజావాణికి 41 ఫిర్యాదులు

ప్రజావాణి ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి:అదనపు కలెక్టర్లు సంగీత, పాండు

Date : 31 August 2026 04:03 PM Views : 39

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఫిర్యాదు, వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు సంబంధిత దరఖాస్తుదారులకు స్పష్టమైన సమాధానం అందించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. దరఖాస్తులపై తీసుకున్న చర్యలను నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు.మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్లు సూచించారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజలు సంబంధిత మండల స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదులు, వినతులు సమర్పించవచ్చని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్లు సూచించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 71 ఫిర్యాదులు, వినతులు అందాయనీ, వీటిలో కలెక్టరేట్‌లో 41, సంగారెడ్డి డివిజన్‌లో 22, జహీరాబాద్ డివిజన్‌ 05, నారాయణఖేడ్ డివిజన్‌ 03 ఫిర్యాదులు, వినతులు అందగా, అందోల్ డివిజన్‌లో ఎలాంటి ఫిర్యాదులు, వినతులు అందలేదని తెలిపారు.ప్రజావాణిలో ప్రధానంగా రెవెన్యూ, హౌసింగ్, పెన్షన్లు, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి, పోలీస్, ఆర్టీసీ, నిమ్జ్, ఎంప్లాయ్‌మెంట్, ఎస్సీ, బీసీ అభివృద్ధి, సహకార, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, వ్యవసాయం, డీఆర్డీఏ, గ్రౌండ్ వాటర్, నీటిపారుదల, ఆర్‌సీఓ, కార్మిక, జిల్లా పరిషత్, మున్సిపల్, విద్య తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు, వినతులు అందాయి.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :