Friday, 25 September 2026 05:29:09 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

క్యూర్ అర్బన్ స్కూల్ శంకుస్థాపనపై రాజకీయ రగడ*

రూ.48 కోట్ల నిధుల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

Date : 17 August 2026 11:50 AM Views : 179

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * ప్రజా పిలుపు తెల్లాపూర్ ఆగస్టు 17 : సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలో క్యూర్ అర్బన్ స్కూల్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.48 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు కొల్లూరు భరత్, శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.క్యూర్ అర్బన్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రావడంతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేయగా, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం ప్రతినినాదాలు చేయడంతో కొద్దిసేపు ప్రాంగణంలో నినాదాల హోరు నెలకొంది.ఇరుపార్టీల నాయకుల నినాదాల మధ్య ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యూర్ అర్బన్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం లేకుండా ఎమ్మెల్యే ఏ విధంగా శంకుస్థాపన చేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :