ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు, సెప్టెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పటాన్‌చెరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.పటాన్‌చెరు పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దళితుల పట్ల బీఆర్‌ఎస్ పార్టీకి మొదటి నుంచి అణచివేత ధోరణే ఉందని ఆరోపించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఈ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఖండించకపోవడం మరింత బాధాకరమని అన్నారు.గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భద్రతా సిబ్బందిని తొలగించి ఆయనను అనేక ఇబ్బందులకు గురిచేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. అలాగే నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారు.రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. తాతా మధుపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం సైబరాబాద్ రేంజ్ డీసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐ రవీందర్‌లకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి, సంగారెడ్డి జిల్లా ఇంటక్ నాయకులు, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి, పీసీసీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, మాజీ ఎంపీపీ రవీందర్‌గౌడ్, రాష్ట్ర యువజన ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, మాజీ సర్పంచులు సంజీవరెడ్డి, జయమ్మ, రాజిరెడ్డి, శ్రీనివాస్, జిన్నారం కౌన్సిలర్లు వడ్డే కృష్ణ, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కపూర్‌సింగ్, పీసీసీ మాజీ కార్యదర్శి మతీన్, మవిన్‌గౌడ్, అరుణ్‌గౌడ్, హబీబ్‌జానీ, రవీందర్ ముదిరాజ్, నాయకులు రాధాకృష్ణ, మార్గారి శ్రీనివాస్, వీరారెడ్డి, అశోక్ ముదిరాజ్, దేవ ముదిరాజ్, రవి ముదిరాజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు