Thursday, 24 September 2026 12:21:42 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి*

నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ*

Date : 17 July 2026 07:56 PM Views : 208

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) వరంగా మారిందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అమీన్పూర్ డివిజన్‌కు చెందిన కూరపాటి రేణుక అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు.దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం రూ.2.50 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి)ను మంజూరు చేసింది. మంజూరైన ఎల్ఓసిని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర వైద్య అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ఓసిలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పూర్తిస్థాయి పారదర్శకతతో లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలు తమ కార్యాలయాన్ని సంప్రదించి సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :