ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ పవిత్ర గురుపౌర్ణమి సందర్భంగా అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్‌లోని సాయి కాలనీ,ఎన్ఆర్ఐ కాలనీ,గోశాలలో ఉన్న సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వేడుకల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి, అమీన్‌పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, ఆలయ నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో వేదమంత్రాల నడుమ అభిషేకం, ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని సాయిబాబాను ప్రార్థించారు. పూజల అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ డైరెక్టర్లు రమేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, కుమ్మరి మహేష్, చంద్రశేఖర్, జన్ముల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సురేష్ నాయక్, బిక్షపతి, కృష్ణ, రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మనోహర్, మస్తాన్ నాయుడు,రాము,మల్లారావు,ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు