ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రపురం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు.ఈ సందర్భంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు బలరాం మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం శుభపరిణామమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండటంతోనే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తమ తల్లిదండ్రులతో పాటు రామచంద్రపురం పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థి దశలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు.పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన రోహిత్ (564), సంగమేశ్వర్ (554), రాజేశ్వరి (529)లను అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.పి. రాథోడ్, సౌభాగ్య, శ్రీనివాస్ గౌడ్, తుకారం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు