ప్రజా పిలుపు / తెలంగాణ / Nalgonda : *ధరల నియంత్రణకు ప్రత్యేక ఫోన్ నంబర్ ఏర్పాటు* *ఫిర్యాదుల కోసం 9281423653కు సంప్రదించండి: కలెక్టర్ బి. చంద్రశేఖర్* నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపి వ్యాపారులు సరుకుల ధరలను పెంచినా, కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు.మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరల పెంపు, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత వంటి అంశాలపై ప్రజలు తమ ఫిర్యాదులను జిల్లా యంత్రాంగానికి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 9281423653 ఫోన్ నంబరును అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.ప్రజలకు అవసరమైన సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని, అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.నిత్యావసర సరుకుల ధరల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే ప్రత్యేక నంబరుకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ కోరారు.
Admin
ప్రజా పిలుపు