ప్రజా పిలుపు / తెలంగాణ / యాదాద్రి భువనగిరి : టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ పాల్గొని తీన్మార్ మల్లన్నతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు.అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు