Friday, 25 September 2026 10:42:02 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

పటాన్‌చెరులో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర

Date : 18 July 2026 10:19 PM Views : 60

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలో హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బంగారు చీపురుతో రథమార్గాన్ని శుభ్రపరిచి, అనంతరం రథాన్ని లాగి యాత్రను ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పూరి శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా విశిష్ట స్థానాన్ని కలిగి ఉందన్నారు. పటాన్‌చెరులో ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరూ శ్రీ జగన్నాథ స్వామివారి ఆశీస్సులతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన్ దేవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రథదాత జలగరి ఎట్టయ్య,విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, నర్ర బిక్షపతి, వంగారి అశోక్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఎంపీఆర్ యువసేన సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :