Friday, 25 September 2026 03:31:31 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

అర తులం బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య

మీర్‌పేట్‌లో కలకలం.. గోనె సంచిలో మృతదేహాన్ని పడేసిన నిందితుడు

Date : 23 August 2026 07:53 PM Views : 44

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : అర తులం బంగారం, రూ.10 వేల నగదు కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో కలకలం రేపింది. స్కూల్‌లో ఆయాగా పనిచేస్తూ ముగ్గురు మనవరాళ్లను పోషిస్తున్న కమలమ్మను చిప్స్ షాప్ నిర్వాహకుడు ప్రకాష్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.పోలీసుల వివరాల ప్రకారం.. అటుగా వెళ్తున్న కమలమ్మను ప్రకాష్ తన చిప్స్ షాప్‌లోకి పిలిచాడు. ఆమె చెవులకు ఉన్న అర తులం బంగారు కమ్మలు, వద్ద ఉన్న రూ.10 వేల నగదుపై కన్నేసిన నిందితుడు ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి షాప్‌ సమీపంలోని నీటి సంపులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కమలమ్మ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలి హత్యతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :