Thursday, 24 September 2026 10:18:24 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

ఎస్‌ఐఆర్‌ అనామలిస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి -- జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సంగీత

ఈనెల 5, 6,12,13, తేదీల్లో స్పెషల్ కంపేయిన్ నిర్వహణ.

Date : 05 September 2026 04:40 PM Views : 36

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో గుర్తించిన వ్యత్యాసాలు (అనామలిస్‌), నో మ్యాపింగ్‌ ఓటర్లకు ఆలస్యం చేయకుండా నోటీసులు జారీ చేయాలని, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) స్పెషల్ కంపేయిన్ లలో బూత్‌ లెవల్‌ అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సంగీత ఆదేశించారు.శనివారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలో ఎస్‌ఐఆర్‌ అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసుల జారీ,ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) స్పెషల్ కంపేయిన్ వంటి తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భముగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు, ఎస్‌ఐఆర్‌, అనామలిస్‌ ,నో మ్యాపింగ్‌ ఓటర్లకు బూత్‌ లెవల్‌ అధికారులు వేగంగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసులు జారీ చేయడంలో ఆలస్యం చేయవద్దని, నోటీసు అందుకున్న ఓటరు విచారణకు తప్పనిసరిగా హాజరై సంబంధిత వివరాలు సమర్పించాలని తెలిపారు. ఓటరు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అవసరమైన పత్రాలతో విచారణకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. బీఎల్‌ఓలు ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాలను ఓటర్లకు పూర్తిగా తెలియజేయాలని సూచించారు. ఓటర్లు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాని వివరాలను సమర్పించాలని తెలిపారు. నోటీసులు జారీ చేసేటప్పుడు అందులో స్థలం, తేదీ, సమయం స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి పౌరుడు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు మొదటి దశ ఈ నెల 5 ,6వ తేదీ ఆదివారం , రెండవదశ 12వ తేదీ శనివారం, 13వ తేదీ ఆదివారం స్పెషల్ కంపేయిన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన సవరణలు ఉంటే నిర్ణీత ఫారాల ద్వారా దరఖాస్తు చే సుకునేందుకు ,బి ఎల్ ఓ లు సహకార్తిస్తారని అన్నారు.జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) స్పెషల్ కంపేయిన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. జిల్లాలోని ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 5,6, 12, 13 తేదీ లలో స్పెషల్ కంపేయిన్ కొనసాగనున్నట్లు అదనపు కలెక్టర్‌ తెలిపారు. ఓటర్లు తమకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) స్పెషల్ కంపేయిన్లు జరిగే రోజుల్లో సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓలు) నిర్దేశిత పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా హాజరవుతారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని సూచించారు.దరఖాస్తుదారులు, ఓటర్లు తమకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాలకు హాజరై ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా తమ పేరు జాబితాలో ఉందో లేదో, నమోదైన వివరాలు సక్రమంగాఉన్నాయోలేదోపరిశీలించుకోవాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు, మార్పులు లేదా లోపాలు ఉంటే వాటిని గుర్తించి సవరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంబంధిత ఈఆర్‌ఓ లు , ఏఈఆర్‌ఓలు కార్యాలయాల్లో కూడా క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించవచ్చని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి పౌరుడు స్పెషల్ కంపేయిన్ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన సవరణలు ఉంటే నిర్ణీత ఫారాల ద్వారా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.ఈ సమావేశంలో సంగారెడ్డి ఆర్‌డీఓ రాజేందర్‌, ఈఆర్‌ఓలు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :