ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన ఉదయం 10:30 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలతో పోరాడి, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమించిన గొప్ప వీరనారి అని కలెక్టర్ తెలిపారు.జయంతి వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
Admin
ప్రజా పిలుపు