Thursday, 24 September 2026 11:37:52 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు

యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్*

Date : 18 August 2026 02:36 PM Views : 70

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * సంగారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆధునీకరించి ఆదర్శ తపాలా కార్యాలయంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రత్యేక పార్సెల్ నిర్వహణ విభాగం, పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించి సంబంధిత శాఖకు పంపడం శుభపరిణామమని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ అన్నారు.యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ సంయుక్తంగా మాట్లాడుతూ.. సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రజల డిమాండ్‌పై గతంలో ప్రజలు, విద్యార్థులు, యువత నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌కు, పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకున్న మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు యువజన సంఘాల సమితి తరఫున మెట్టుశ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు అయితే జిల్లాలోని విద్యార్థులు, విదేశాలకు వెళ్లే యువతతో పాటు సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పాస్‌పోర్ట్ సేవల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గి, స్థానికంగానే సేవలు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.సంగారెడ్డి జిల్లా ప్రజల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా సంబంధిత శాఖలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని యువజన సంఘాల సమితి నాయకులు కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :