Sunday, 08 November 2026 02:23:26 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పటాన్‌చెరు పారిశుద్ధ్యానికి రూ.12 కోట్లతో ఆధునిక వాహనాలు

తోషిబా సీఎస్ఆర్ నిధులతో 10 స్వీపింగ్ మిషన్లు, 10 టిప్పర్లు.. ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్

Date : 02 November 2026 12:10 PM Views : 58

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తోషిబా పరిశ్రమ సీఎస్ఆర్ నిధులతో రూ.12 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 10 స్వీపింగ్ మిషన్లు, 10 టిప్పర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.సోమవారం పటాన్‌చెరు మైత్రి మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్, తోషిబా పరిశ్రమ హెచ్‌ఆర్ డైరెక్టర్ మారు మోటోతో కలిసి తొలి విడతలో ఐదు స్వీపింగ్ మిషన్లు, ఐదు టిప్పర్లను ప్రారంభించారు. అమీన్పూర్ సర్కిల్‌కు మూడు స్వీపింగ్ మిషన్లు, మూడు టిప్పర్లు, పటాన్‌చెరు సర్కిల్‌కు రెండు స్వీపింగ్ మిషన్లు, రెండు టిప్పర్లను కేటాయించినట్లు తెలిపారు. బీహెచ్‌ఈఎల్ నుంచి ఇస్నాపూర్ వరకు జాతీయ రహదారి పరిశుభ్రతకు ప్రత్యేక స్వీపింగ్ మిషన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా, నూతన కాలనీలకు అనుగుణంగా పారిశుద్ధ్య సేవలను మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. ప్రతి డివిజన్‌కు స్వీపింగ్ మిషన్, టిప్పర్, జేసీబీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తొమ్మిది డివిజన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, మరణించిన పారిశుద్ధ్య కార్మికుల స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించి పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. తోషిబా పరిశ్రమ ఎండీ మారు మోటో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తమ పరిశ్రమ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులతో పారిశుద్ధ్య వాహనాలు సమకూర్చడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు, అమీన్పూర్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు కావ్య, లలిత శ్రావణి, తోషిబా పరిశ్రమ ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :