Sunday, 09 August 2026 06:13:56 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

పటాన్‌చెరు పట్టణంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ*

పాల్గొన్న పటాన్చెరు బిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమురగూడెం వెంకటేష్

Date : 27 June 2026 04:44 PM Views : 319

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 27 శనివారం: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని ఒకటి, రెండు వార్డుల్లో శనివారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల శాఖ అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, కుటుంబ వివరాలు, ఇతర సమాచారాన్ని ధృవీకరించి అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం వివరాలను నమోదు చేశారు.18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు తమ వివరాలను ఒకసారి పరిశీలించి తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో తప్పులులేకుండా రూపొందించడమే లక్ష్యమని తెలిపారు.ప్రజలు తమకు సంబంధించిన ఆధార పత్రాలను సిద్ధంగా ఉంచి అధికారులకు సహకరించాలని, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వార్డుల వారీగా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బి ఆర్ ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమురగూడెం వెంకటేష్ బి ఎల్ వో లు తదితరులు,పాల్గొన్నారు

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :