ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాకి చెరువును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాలను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.చెరువు వద్ద భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు