Friday, 25 September 2026 01:21:37 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

వినాయక ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

Date : 09 September 2026 07:52 PM Views : 46

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఈ నెల 14న నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ గత ఏడాది ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వినాయక మండపం వద్ద పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద బారికేడ్లు, ఈతగాళ్లు, విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట్ల క్రేన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. నిమజ్జన మార్గాల్లో అవసరమైన రహదారి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ మండలాల్లో అన్ని మతాల పెద్దలు, వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు.వినాయక మండపాలు ఏర్పాటు చేయదలచిన నిర్వాహకులు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మండపాలను రహదారులపై, కాలిబాటలపై, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే ప్రాంతాల్లో ఏర్పాటు చేయరాదన్నారు. భద్రత దృష్ట్యా ప్రతి మండపం వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అధిక శబ్దంతో కూడిన ధ్వని పరికరాలు, డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. తక్కువ శబ్దంతో కూడిన మైకులు, స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే మండప నిర్వాహకులతో పాటు డీజే యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.యువత సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని, నిర్ధారణ లేని సందేశాలను ఇతరులకు పంపవద్దని ఎస్పీ సూచించారు. ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, పాటలు ప్రసారం చేయడం వంటి చర్యలకు పాల్పడరాదన్నారు.మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలుచేశారు .ప్రతి వినాయక మండపం ఏర్పాటు చేసే ముందు తెలంగాణ పోలీసు పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలి. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిమజ్జనం చేసే ప్రదేశం, తేదీ, సమయం, నిమజ్జన మార్గం తదితర వివరాలను నమోదు చేయాలి. రహదారులు, కాలిబాటలు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేయరాదు.భక్తుల వాహనాల కోసం మండపానికి కొంత దూరంలో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి.విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. వర్షాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధ్వని పరికరాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి.పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో అధిక శబ్దంతో కూడిన ధ్వని పరికరాలు ఏర్పాటు చేయరాదు. మండపాల వద్ద రాత్రివేళ కనీసం ఇద్దరు లేదా ముగ్గురు స్వచ్ఛంద కార్యకర్తలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.టపాకాయలు, మందుగుండు సామగ్రిని మండపాల వద్ద నిల్వ చేయరాదు.విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర దీపాలను అందుబాటులో ఉంచుకోవాలి.మండపాల వద్ద నిఘా కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.లక్కీ డ్రాలు నిర్వహించడం, బలవంతంగా చందాలు వసూలు చేయడం చేయరాదు.మద్యం, మత్తు పదార్థాల వినియోగం, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వరాదు. ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు తదితర అగ్ని నిరోధక సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి.రాత్రివేళ తనిఖీలకు వచ్చే పోలీసు అధికారులకు మండప నిర్వాహకులు, స్వచ్ఛంద కార్యకర్తలు పూర్తిగా సహకరించాలి.పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. * భారీ విగ్రహాల కారణంగా నిమజ్జనం సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా సాధ్యమైనంతవరకు పరిమిత పరిమాణంలో విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు లేదా సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలి.వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలకు సహకరించాలని అధికారులు కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :