Monday, 09 November 2026 03:07:44 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

22ఏ భూ సమస్యలపై బీజేపీ భారీ నిరసన దీక్ష

తప్పుగా 22ఏలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలి: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్

Date : 31 August 2026 04:08 PM Views : 186

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : 22ఏ భూ సమస్యలను పరిష్కరించి, తప్పుగా 22ఏ జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న భారీ నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం నర్సాపూర్ అసెంబ్లీ పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బస్టాండ్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డుపై సెప్టెంబర్ 2, బుధవారం భారీ నిరసన దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.22ఏ పేరుతో సామాన్య ప్రజలు తమ సొంత భూములను విక్రయించుకోలేక, రిజిస్ట్రేషన్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాధామల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. ఎలాంటి తప్పు చేయని భూయజమానులకు న్యాయం చేయాలని, పొరపాటున 22ఏ జాబితాలో చేరిన భూములను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నిరసన దీక్షకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.మెదక్ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు రమేష్ గౌడ్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, మోర్చాల అధ్యక్షులు సత్యనారాయణ, రాములు నాయక్, మండల అధ్యక్షుడు నీలి నగేష్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకుడు గుండం శంకర్, మహిళా మోర్చా నాయకురాలు మౌనిక, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్ గౌడ్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, అనిల్, మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ పాషా, బీజేపీ నాయకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :