ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గుమ్మడిదల 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లలో మరమ్మతు పనుల కారణంగా నేడు గురువారం గుమ్మడిదల, జిన్నారం ఉమ్మడి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు గుమ్మడిదల ఏడీఈ దుర్గాప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుమ్మడిదల, జిన్నారం, బొంతపల్లి, కానుకుంట, నల్లవల్లి, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, సోలక్‌పల్లి, శివనగర్, గడ్డపోతారం-1, గడ్డపోతారం-2, విశాల్ తదితర సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ మరమ్మతు పనులకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బొంతపల్లి ఏఈ రవీందర్, జిన్నారం ఏఈ తుకారాం పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు