Friday, 25 September 2026 01:21:24 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

తొలగించిన జీపీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

Date : 04 September 2026 05:36 PM Views : 60

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వట్టిపల్లి: తొలగించిన జీపీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ వట్టిపల్లి మండల కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు. వట్టిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు.జీపీ కార్మికులకు మాస్కులు, నూనె, బూట్లు, చేతి తొడుగులు, దుస్తులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్త సర్పంచుల తర్వాత కొన్ని గ్రామాల్లో కార్మికులను తొలగించడం సరికాదని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.కార్యక్రమంలో జీపీ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు భీమయ్య, నాయకులు గమ్మినాయక్, బాలయ్య, రాజయ్య, కాజా, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :