ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ బచావ్ – దేశ్ బచావ్’ భారీ నిరసన ర్యాలీ, బహిరంగ సభలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న అవకతవకలు, ఓటర్ల పేర్ల తొలగింపు తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాట శ్రీనివాస్ గౌడ్ నిరసన గళం వినిపించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ, ఓటర్ల హక్కుల కాపాడటమే లక్ష్యంగా పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేపడుతున్న ఉద్యమంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Admin
ప్రజా పిలుపు