Thursday, 24 September 2026 12:10:23 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

ఎస్‌ఐఆర్‌ విజయవంతంగా పూర్తి చేసిన బూత్ స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలకు అభినందనలు

Date : 26 August 2026 03:03 PM Views : 123

ప్రజా పిలుపు / తెలంగాణ / ఖమ్మం : నార్కట్‌పల్లి పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా బూత్ స్థాయి ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, నకిరేకల్ నియోజకవర్గ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సమన్వయకర్త, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు, ఎన్నికల నమోదు అధికారి స్థాయి సమన్వయకర్త చామల శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన బూత్ స్థాయి ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వారు అభినందించారు. ప్రక్రియలో భాగంగా అర్హులైన ఓటర్ల పేర్లు ఎవరైనా జాబితాలో లేకపోతే వెంటనే గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రతి అర్హుడైన ఓటరుకు ఓటు హక్కు ఉండేలా, ఓటరు జాబితా సక్రమంగా ఉండేందుకు బూత్ స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో మరింత బాధ్యతగా పనిచేయాలని వారు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :