ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే సంఘటన్ సృజన్ అభియాన్ లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం అశోక్‌నగర్‌లోని సితార హోటల్‌లో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నీలం మధు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు