Saturday, 26 September 2026 03:24:14 PM
# వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం # అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు*

ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండండి ప్రతి ఓటు అత్యంత కీలకం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 06 July 2026 12:54 PM Views : 95

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. సరైన సమాచారం లేకపోవడంతో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సోమవారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ తరఫున నియమితులైన బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ప్రతి అర్హ ఓటరిని ఎస్ఐఆర్‌లో నమోదు చేయించేలా కృషి చేయాలని సూచించారు. పటాన్చెరు “మినీ ఇండియా”గా పేరుగాంచిన నియోజకవర్గమని, ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నెల 12న పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా ఎస్ఐఆర్, బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్షిప్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :