ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు ప్రాంతంలోని హల్దీ వాగు పరిసరాల్లో విద్యుత్ షాక్కు గురై ఒడిశాకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు ఒడిశాకు చెందిన మురుము చైతన్ (30) విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్నిప్రభుత్వఆసుపత్రికితరలించారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఘటన జరిగిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోందని ఎస్ఐ గంగరాజు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు