ప్రజా పిలుపు / తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం. : స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఎన్‌ఎస్‌యూఐ కొత్తగూడెం: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎన్‌ఎస్‌యూఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సురేష్ అజ్మీర ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సురేష్ అజ్మీర మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధ పదవులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని పేర్కొన్నారు.స్పీకర్‌ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్ చేసింది. ప్రజాప్రతినిధులు తమ హోదాకు తగిన విధంగా బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలని, రాజకీయ విభేదాల పేరుతో రాజ్యాంగబద్ధ పదవులను అవమానించడం సరికాదని సురేష్ అజ్మీర అన్నారు.“స్పీకర్‌పై దూషణలు చేసిన తాతా మధుకు ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఇదే గట్టి హెచ్చరిక” అంటూ నినాదాలు చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు వసీం పాషా, కాటి సందీప్, లావుడియా గౌతమ్, ఉబ్బపల్లి నిఖిల్, షేక్ సమీర్, షేక్ అప్రోచ్, సాయి, లక్కీ, షేక్ జమీల్, షాహిద్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు