ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : వికారాబాద్ :తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ హెచ్-143 వికారాబాద్ నియోజకవర్గ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా కన్వీనర్ రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఆసిఫ్ హుస్సేన్,సహకన్వీనర్లు,జి.నర్సింలు,టి.ఆనంద్,సయ్యద్ జావీద్ పాషా, కే.సంతోష్ కుమార్, బి.రాజు సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం,సంక్షేమం,హక్కులపరిరక్షణతోపాటుసంఘాన్నిమరింతబలోపేతంచేసేలానూతనకమిటీపనిచేయాలని నాయకులు సూచించారు.జర్నలిస్టుల సమస్యలను జిల్లా,రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామనితెలిపారు.నూతన కమిటీలోగౌరవఅధ్యక్షులుగాకే.నర్సింలు,ఎల్.విశ్వనాథం,ఎం.నాగిరెడ్డి,అధ్యక్షుడిగా కే.గోపాల్, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పి.అరుణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎం.అమరేందర్, ప్రధాన కార్యదర్శిగా కె.సంతోష్ కుమార్,కోశాధికారిగాఎం.వెంకటేష్ఎన్నికయ్యారు.సంయుక్తకార్యదర్శులుగావి.రామకృష్ణాచారి,పి.అంజిలయ్య,ప్రచారబాధ్యులుగాబి.నర్సింలు,టి.నరేందర్,కార్యదర్శులుగా బి.నర్సింలు (రాజు), షఫీ ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా కే. లాలయ్య, టి.జగన్, సందీప్ గుప్త ,ఎన్.అరుణ్,సి.విజయ్,ఎస్.శ్రీకాంత్ఎన్నికయ్యారు.నూతన కమిటీ సభ్యులను రాష్ట్ర,జిల్లా నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని, నియోజకవర్గంలో జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు