ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రాపురంలోని శ్రీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ‘చెన్నై షాపింగ్ మాల్’ వస్త్ర, ఫ్యాషన్ ప్రదర్శనను ప్రముఖ సినీ నటి హెబ్బా పటేల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్త్రాలు, ఫ్యాషన్ ఉత్పత్తులను ఆమె పరిశీలించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో నూతన డిజైన్లతో కూడిన వస్త్రాలు, వివిధ రకాల షాపింగ్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండేలా రామచంద్రాపురంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అధిక సంఖ్యలో నూతన వస్త్రాలు, వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం అభినందనీయమని పేర్కొన్నారు. వినియోగదారుల ఆదరణ పొందేలా విభిన్న రకాల వస్త్రాలు, ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రదర్శన ప్రారంభోత్సవానికి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సినీ నటి హెబ్బా పటేల్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్త్రాలు, ఉత్పత్తులను ప్రజలు ఆసక్తిగా పరిశీలించారు.
Admin
ప్రజా పిలుపు