Tuesday, 10 November 2026 03:51:47 PM
# యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి*

*మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో విస్తృత చైతన్యం అవసరం : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

Date : 25 June 2026 02:35 PM Views : 120

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు సంగారెడ్డి, జూన్ 25 :--ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఎంత ముఖ్యమో, యువత భవిష్యత్తుకు మాదకద్రవ్యాల రహిత సమాజం అంతే అవసరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్-2026)పై ఓటర్లలో అవగాహన కల్పించడంతో పాటు మాదకద్రవ్యాలను నిర్మూలించాలన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు గురువారం నిర్వహించిన 2కె రన్‌ను వారు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత అని పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి ఓటరుగా నమోదు కావాలని, చిరునామా మార్పులు, పేరు సవరణలు, ఇతర వివరాల నవీకరణ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నేటి నుంచి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ప్రజలు సరైన వివరాలను అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.అలాగే మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువతకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని పేర్కొంటూ, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యకలాపాల ద్వారా యువత తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టడంలో పోలీసు శాఖకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత చెడు అలవాట్ల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు ‘నో’ చెప్పి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ 2కె రన్‌లో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, సాంస్కృతిక సారథి కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :