ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్: బీరంగూడ సింఫనీ రోడ్‌లోని ప్యూర్ ఓ నేచురల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చికెన్ గ్రిల్ హౌస్ – బార్బిక్యూ అండ్ కేఫ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. నూతనంగా ప్రారంభమైన చికెన్ గ్రిల్ హౌస్‌లో రుచికరమైన గ్రిల్ చికెన్, బార్బిక్యూ వంటకాలతో పాటు కేఫ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బీరంగూడ ప్రాంతంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటవడం అభినందనీయమన్నారు. చికెన్ గ్రిల్ హౌస్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీరంగూడ దేవాలయ చైర్మన్ బి. సుధాకర్ యాదవ్, మెంబర్ మల్లేష్, అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రమేష్ యాదవ్, ఆత్మ కమిటీ సభ్యుడు భిక్షపతి, కృష్ణ యాదవ్, వెంకట్, సురేష్ నాయక్, శ్రీకాంత్ రెడ్డి, భగవాన్ రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు