Sunday, 09 August 2026 08:10:30 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

భానూరు కాంగ్రెస్ కీలక నేతలు బీఆర్ఎస్‌లో చేరిక

Date : 27 June 2026 07:57 PM Views : 107

ప్రజా పిలుపు / తెలంగాణ / హైదరాబాదు : పటాన్చెరు, శనివారం: భానూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు శనివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలు ప్రవళిక నరేందర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాగర్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమ్మరి శివయ్య తదితరులు తమ అనుచరులతో కలిసి చేరారు.ఈ సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వం, హరీష్ రావు నేతృత్వంపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్‌కు కంచుకోటగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్‌లో చేరడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అసంతృప్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని గుర్తుచేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని పాలనను కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.భానూరు గ్రామంలో ఈ చేరికలతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :