Thursday, 24 September 2026 12:10:27 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి

Date : 13 September 2026 01:43 PM Views : 38

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బీరంగూడ డివిజన్ పరిధిలోని సాయికృపా కాలనీ, సాయి భగవాన్ కాలనీలలో నూతనంగా నిర్మించిన వినాయక మండపాలను ఆదివారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలనీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకుంటూ, ప్రజలందరూ ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని సూచించారు.నూతనంగా నిర్మించిన వినాయక మండపాల వద్ద ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షులు నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్ కృష్ణ, బోయిని బాలమణి బాలరాజు, కొల్లూరి మల్లేష్, నవనీత జగదీష్, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :