Friday, 25 September 2026 03:30:37 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

గణేష్ ఉత్సవాలపై నిర్వాహకులకు అవగాహన సమావేశం

Date : 08 September 2026 05:52 PM Views : 63

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : భానూర్: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు బీడీఎల్‌ భానూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గణేష్‌ మండపాల నిర్వాహకులతో పోలీసుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది గణేష్‌ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గణేష్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకునే విధానాన్ని నిర్వాహకులకు వివరించారు. మండపాల వద్ద పాటించాల్సిన భద్రతా చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.అదేవిధంగా గణేష్‌ విగ్రహ నిమజ్జనం సమయంలో నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు.మండపాల వద్ద శబ్ద కాలుష్యానికి కారణమయ్యే డీజేలను వినియోగించరాదని నిర్వాహకులకు స్పష్టంగా సూచించారు. గణేష్‌ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :