ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్: వ్యాపార రంగంలో వినియోగదారుల నమ్మకాన్ని పొందాలంటే నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మెరుగైన సేవలను అందించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. కస్టమర్లకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన సర్వీస్ అందిస్తూ వారి అభిమానాన్ని పొందాలని, తద్వారా వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్వాహకులకు సూచించారు.అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రుద్ర విల్లాస్ టీ పాయింట్‌ను మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని టీ పాయింట్‌ను ప్రారంభించారు.అనంతరం నిర్వాహకులను అభినందించిన హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏ వ్యాపారమైనా ప్రజల ఆదరణతోనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యంగా హోటల్, టీ పాయింట్ వంటి ఆహార సంబంధిత వ్యాపారాల్లో పరిశుభ్రత, నాణ్యత, రుచితో పాటు కస్టమర్లకు అందించే సేవలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలను గుర్తించి వారికి సంతృప్తికరమైన సేవలు అందిస్తే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.స్థానికంగా ఏర్పాటు చేసిన రుద్ర విల్లాస్ టీ పాయింట్ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని, నిర్వాహకులు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. నిత్యం వచ్చే కస్టమర్లతో పాటు కొత్తగా వచ్చే వినియోగదారులను కూడా ఆకట్టుకునే విధంగా మంచి సేవలు అందించాలని సూచించారు.ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి హరీశ్ రావును ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రుద్ర విల్లాస్ టీ పాయింట్ నిర్వాహకులు,స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు