Friday, 25 September 2026 10:01:52 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు*

శాఖల సమన్వయంతో భద్రతా చర్యలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్*

Date : 24 September 2026 07:26 PM Views : 11

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.ఈ సందర్భంగా గురువారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన చెరువులు, కుంటలు, శోభాయాత్ర మార్గాలను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించినట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్, లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లతో పాటు తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల పరిస్థితి, అవసరమైన మరమ్మతులు, విద్యుత్ వైర్లు, లైటింగ్ తదితర అంశాలను పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఫైర్ తదితర శాఖల సమన్వయంతో పర్యవేక్షించి అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలు నిమజ్జనం సమయంలో ఎవరూ బారికేడ్లను దాటి నీటిలోకి వెళ్లకూడదు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల విషయంలో నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి,శోభాయాత్రల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలను రోడ్లపై నిలిపివేయకూడదు,ప్రమాదకర వస్తువులు, నిషేధిత సామగ్రిని ఊరేగింపుల్లో వినియోగించరాదు,మద్యం సేవించి శోభాయాత్రల్లో పాల్గొనడం, వాహనాలు నడపడం వంటి చర్యలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి.విద్యుత్ వైర్లను చేతులతో గానీ, కర్రలతో గానీ తాకరాదు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతూ కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.నిమజ్జన కార్యక్రమాల్లో నిర్వాహకులు, భక్తులు పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :