Thursday, 24 September 2026 12:10:24 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

27న టీజేఏసీ ధర్నాను జయప్రదం చేయాలి

Date : 26 August 2026 04:09 PM Views : 91

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని టీటీయూ జిల్లా అధ్యక్షులు పి. ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్ పిలుపునిచ్చారు.స్థానిక పోతిరెడ్డిపల్లి పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, నూతన పీఆర్సీని ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈహెచ్ఎస్‌ను సక్రమంగా అమలు చేయడంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న నిర్వహించనున్న ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బట్టు నరసింహరాజు, జిల్లా కార్యదర్శి రాములు, రాష్ట్ర అధ్యక్షులు మొగులయ్య, జిల్లా మహిళా కార్యదర్శులు సౌజన్య, సుమాలిని తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :