Thursday, 24 September 2026 12:11:24 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణ వేగవంతం చేయాలి

నేషనల్ హైవే అధికారులకు భూమిని అప్పగించేలా చర్యలు..రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె. గంగాధర్

Date : 09 September 2026 06:58 PM Views : 42

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, నేషనల్ హైవే అధికారులకు భూమిని అప్పగించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె. గంగాధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.బుధవారం గజ్వేల్ పట్టణంలోని సమీకృత కార్యాలయ సముదాయంలో రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణపై నేషనల్ హైవే, రెవెన్యూ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి కె. గంగాధర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాయని తెలిపారు.సిద్దిపేట జిల్లాలో రాయపోల్, వర్గల్, మర్కుక్, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరగనున్న నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.భూ సేకరణకు సంబంధించి మధ్యవర్తిత్వ ప్రక్రియను సైతం వేగవంతం చేయాలని సూచించారు. భూ సేకరణలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఆయా ప్రాంతాలకు కలిగే అభివృద్ధి ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అన్నారు.భూ సేకరణ ప్రక్రియను ఆర్డీఓ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భూ సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో డ్రోన్ సర్వే నిర్వహించి, రైతులు కొత్తగా పంటలు సాగు చేయకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. భూ సేకరణ పూర్తయిన అనంతరం నిబంధనల ప్రకారం ఆ భూమిని నేషనల్ హైవే అధికారులకు అప్పగించాలని ఆదేశించారు.రీజనల్ రింగ్ రోడ్ కోసం నేషనల్ హైవే అధికారులకు అప్పగించిన భూమిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమీక్షలో ఆర్డీఓ చంద్రకళ, నేషనల్ హైవే అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు, సర్వే అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :