ప్రజా పిలుపు / తెలంగాణ / ఖమ్మం : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, వైరా నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు, గోపవరం పీఏసీఎస్ చైర్మన్ వడ్డే నారాయణరావు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో వారు ఆత్మీయంగా ముచ్చటించి, పలు అంశాలపై పరస్పరం మాట్లాడుకున్నారు.
Admin
ప్రజా పిలుపు