Thursday, 24 September 2026 11:43:54 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

5.5 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం

నిందితులంతా బీహార్‌కు చెందినవారే.. ఒకరు పరారీ

Date : 10 July 2026 08:59 PM Views : 101

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కొల్లూరు నిర్మాణ రంగానికి చెందిన లేబర్ క్యాంపులో కార్మికులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర పెడ్లర్లను కొల్లూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. వేల విలువైన 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'మై హోమ్ సయుక్' నిర్మాణ సంస్థకు చెందిన లేబర్ క్యాంపులో కొందరు వ్యక్తులు కార్మికులకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు శుక్రవారం దాడి చేసి ఐదుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో బీహార్ రాష్ట్రం, దర్భంగా జిల్లాకు చెందిన ఎం.డి. కైఫ్ (20), ఎం.డి. సైఫ్ (21) (ఇద్దరూ అన్నదమ్ములు), ఎం.డి. తుఫైల్ (21), ఎం.డి. కలీమ్ (28) ఉన్నారు. వీరంతా తెల్లాపూర్‌లోని మై హోమ్ లేబర్ క్యాంపులో ఉంటూ పెయింటింగ్, కూలీ పనులు చేస్తున్నారు. వీరు తమ సొంత రాష్ట్రం బీహార్ నుండి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి కార్మికులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.ఈ కేసులో A-2 నుంచి A-5 వరకు ఉన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, అసదుల్లా అలియాస్ అబ్దుల్లా అనే మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడు బీహార్‌లోని దర్భంగా జిల్లా, కట్టా గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కొల్లూర్ పోలీసులు తెలిపారు. కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :