ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్‌గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం సిద్ధి గణపతి స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు ప్రత్యేక దర్శనం ఇచ్చారు.మూడవ రోజు ఉదయం ఆలయంలో పంచామృత విశేష అభిషేకం, ప్రత్యేక హోమం తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పీత వర్ణంలో అలంకరించిన సిద్ధి గణపతి స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, అర్చకులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు