ప్రజా పిలుపు / ఆంధ్ర ప్రదేశ్ / నెల్లూరు : గూడూరు: నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలోని విందూరు జెడ్పీ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రచయిత కొండూరు వెంకటేశ్వరరాజుకు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ పీస్ అడ్వకేట్ అవార్డు లభించింది.ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అంతర్జాతీయ సేవా సంస్థ ఇంటర్నేషనల్ అకాడమీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని సంస్థ అధ్యక్షులు ఎఎంబీ డాక్టర్ టి. సోనీ మంగళవారం అంతర్జాలం ద్వారా కొండూరు వెంకటేశ్వరరాజుకు అందజేశారు.విద్యా రంగంలో సేవలతో పాటు రచయితగా సాహిత్య రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు వెంకటేశ్వరరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, అభినందనలు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు