ప్రజా పిలుపు / ఆంధ్ర ప్రదేశ్ / నెల్లూరు : గూడూరు మండల పరిధిలోని విందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, రచయిత కొండూరు వెంకటేశ్వరరాజుకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది.జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెండోడుకు చెందిన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ లీలా మోహన్ కృష్ణ ఈ పురస్కారాన్ని వెంకటేశ్వరరాజుకు అందజేశారు.గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఉపాధ్యాయుడిగా అంకితభావంతో బోధనా బాధ్యతలను నిర్వహిస్తున్న వెంకటేశ్వరరాజు.. మరోవైపు రచయితగా తన రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల వికాసానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఆయన విద్యా, సాహిత్య సేవలను గుర్తించి ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేశారు.
Admin
ప్రజా పిలుపు